ముఖ్యంప్రజాశక్తి- రాయచోటి క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొని ఆరోగ్యంగా జీవించాలని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేతాజీ స్కూల్‌లో 68 వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా, అండర్ 17 బాల, బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో అండర్-17 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం ఎంత సంతోషంగా ఉందన్నారు. ఈనెల 27, 28, 29 మూడు రోజులు పాటు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి, మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రతి ఓటమి మరో గెలుపునకు నాంది పలుకుతుందని చెప్పారు. ఈ పోటీలలో ఓడినవారు నిరుత్సాహం చెందకుండా రాబోయే ఆటలలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం విద్య, ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గతంలో కొంతమంది దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని వ్యాయామ ఉద్యోగాలు పొందేవారని, ఈ ప్రభుత్వంలో అలాంటి వాటికి చోటు లేదని స్పష్టం చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో రాయచోటి పట్టణంలో అన్ని కార్యక్రమాలకు వేదికగా ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. మూడు రోజులపాటు జరిగే కబడి పోటీలలో 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే ందుకు ముందుకు వచ్చిన దాతలకు కతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సభా కార్యక్రమానికి ముందుగా ప్రార్థనాగీతం, జాతీయ పతాక ఆవిష్కరణలతో కార్యక్రమాలకు శ్రీకారం చుటారు. కార్యక్రమానికి హాజరయిన అతిధులు క్రీడా జ్యోతి వెలిగించి క్రీడోత్సవాలను ప్రారంభించారు. అనంతరం 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల గౌరవ వందనం మంత్రి స్వీకరించి, అంతరం కబడ్డీ క్రీడా కారులను పరిచయం చేసుకుని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.సురక్షిత ప్రయాణమే ఆర్‌టిసి లక్ష్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్‌టిసి ముఖ్య ఉద్దేశమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలో 10 నూతన ఆర్‌టిసి బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజులలో మరిన్ని నూతన ఆర్‌టిసి బస్సులను ప్రారంభించి ప్రజలకు సులభతరమైన రవాణా సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రయాణికుల సంక్షేమమే ముఖ్యంగా భావిస్తోందని ఇకనుంచి ప్రయా ణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నూతన బస్సుల్లో హైదరాబాద్‌కు 2 ఇంద్ర బస్సులు, మదనపల్లె ఒకటవ డిపో నుంచి ఒక సూపర్ లగ్జరీ, ఒక ఎక్స్ప్రెస్, మదనపల్లె రెండవ డిపో నుంచి రెండు సూపర్ లగ్జరీలు, ఒక ఎక్స్ప్రెస్, పీలేరు డిపో నుంచి ఒక ఎక్స్ప్రెస్, పుంగనూరు డిపో నుంచి రెండు పల్లెవెలుగు బస్సులను నడుపుతారని చెప్పారు. ఈ సంద ర్భంగా బెలూన్లతో అలంకరించిన 10 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.