సిబిఎస్‌ఈ 10, 2 ఫలితాలలో శ్రీ ప్రకాష్‌ విద్యార్థుల విజయకేతనం

May 14,2024 11:49 #cbse, #Results, #students, #Success

ప్రజాశక్తి-కోటనందూరు (కాకినాడ) : సిబిఎస్‌ఈ ప్రకటించిన పదవ, 2 ఫలితాలలో తుని శ్రీ ప్రకాష్‌ విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించారని విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్‌.విజయ ప్రకాష్‌ తెలిపారు. పదవ తరగతి ఫలితాలలో షేక్‌ నజ్నీన్‌ 486/500, పెనుమత్స వర్షిణి 485/500, కఅపాలిని పట్జోషి 484/500 అగ్రగాములుగా నిలిచారని, 2 ఫలితాల వద్ద వెదురుపాక విజరు రిషి 91 శాతం సాధించి అగ్రగాములుగా నిలిచారని, నూటికి నూరుశాతం ఉత్తీర్ణతా శాతం తో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కార్యదర్శి తెలిపారు. మాథ్స్‌, తెలుగు సబ్జెక్టుల వద్ద తమ విద్యార్థులు 100 కి 100 మార్కులు సాధించడం హర్షణీయమని అన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను విద్యా సంస్ధల అధినేత సిహెచ్‌.వి.కె.నరసింహారావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, తదితరులు అభినందించారు.

➡️