‘ఏపీ ఇఎపి’లో రాణించిన శ్రీ ప్రతిభ విద్యార్థులు

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : ఏపీ ఇఎపి సెట్‌-2024 పరీక్షా ఫలితాలలో శ్రీ ప్రతిభ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మరిసాల విష్ణువర్ధన్‌ రెడ్డి 660, వడ్లమూడి నందిని చౌదరి 1552 స్టేట్‌ ర్యాంకులు సాధించారు. 5000 లోపు 13 మంది, 10 వేల లోపు 23 మంది, 15 వేల లోపు 44 మంది, 20 వేల లోపు 51 మంది, 25 వేల లోపు 75 మంది, 30 వేల లోపు 190 మంది 35 వేల లోపు 101 మంది ర్యాంకులు సాధించారని శ్రీ ప్రతిభ విద్యాసంస్థల ఛైర్మన్‌ నల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నల్లూరి సీతారామాంజనేయులు, సిఇఒ నల్లూరి జయప్రకాశ్‌ నారాయణ్‌ విద్యార్థులకు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

➡️