చెరువు కింద వరి సాగుకు సన్నద్ధం

వరినాట్లకు సిద్ధం చేసిన ఆయకట్టు భూములు

ప్రజాశక్తి -ధర్మవరం రూరల్‌

ధర్మవరం చెరువు ఆయకట్టు కింద ఉన్న రైతులు వరి నాట్లు ప్రారంభించారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా ధర్మవరం చెరువులో నిండుకుండలా నీరు ఉన్న వరిసాగు చేయలేక ఇబ్బంది పడిన రైతులు ఈ సారి వరిసాగుకు సిద్ధమయ్యారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ చొరవతో ధర్మవరం చెరువు ఆయకట్టు కింద ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన పూడికను 30 రోజులు పాటు జెసిబిలతో తీయించారు. దీంతో ప్రధాన కాలువలు గుండా చెరువు నీరు ప్రవహించాయి. 40 ఏళ్లుగా ధర్మవరం చెరువు ఆయకట్టు కింద ప్రధాన కాలువ పూడికతీత పనులు ఏ ఒక్కరు పట్టించుకోలేదని ఈసారి పరిటాల శ్రీరామ్‌ ప్రత్యేక చొరవతో పూడిక తీత పనులు చేయించాలని రైతులు చెబుతున్నారు.

➡️