చేనేతకు పూర్వ వైభవం జగనన్నతోనే సాధ్యం

Feb 11,2024 22:08

పార్టీలోకి చేరిన వారితో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

                   ధర్మవరం టౌన్‌ : చేనేతకు పూర్వవైభవం తీసుకురావటం జగనన్నతోనే సాధ్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన చేనేత ప్రముఖుడు బుడగల శంకర్‌ తన అనుచరులు, చేనేత కార్మికులకు చెందిన 300కుటుంబాలు వైసిపి తీర్థం పుచ్చుకున్నాయి. ఆదివారం స్థానిక ఎస్‌బిఐ కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వారందరికి పార్టీ కండువాలు కప్పి వైసిపితోకి ఆహ్వానించారు. అంతకు ముందు బోడగల శంకర్‌ తన అనుచరులతో కలసి పట్టణంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. పార్టీలోకి చేరిన వారిలో బుడగల శంకర్‌, చాక్లెట్‌ సూరీ, బ్యాళ్ల పార్థ, పల్లా శేఖర్‌, జింకా బాబు, గొడ్డుమర్రి మురళీ, పోతులయ్య, చెన్నా లక్ష్మినారాయణ, ఓబిలేసు, నిమ్మల మోహన్‌, భాస్కర్‌, శీలా నారాయణ, మధుసూదన్‌ నాయుడు, రాఘవేంద్ర, భరత్‌, రాము, నిమ్మల మోహన్‌ తదితరులు ఉన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేతపరిశ్రమ గత టీడీపీ పాలనలో నిర్వీర్యం అయిందన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పథకాల ద్వారా ఉచిత వైద్య, వైద్యం, ఆర్ధిక పరిపుష్టిని అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వేముల జయరామిరెడ్డి, చేనేత నాయకులు దాశెట్టి నాగరాజు, వైసిపి నాయకులు నీలూరి ప్రకాష్‌, కోటిరెడ్డి బాలిరెడ్డి, కాచర్ల అంజి, సిద్ధిరాజేష్‌, ఉడుముల రాము, జింకా కంబగిరి, జింకా రెడ్డప్ప, గోలి నాగభూషణ తదితరులు పాల్గొన్నారు.

➡️