టీడీపీలో పలువురు చేరిక

Feb 13,2024 21:48

 పార్టీలోకి చేరిన వారితో పరిటాల సునీత

                      చెన్నేకొత్తపల్లి : మాజీ మంత్రి పరిటాల సునీత సమక్షంలో పలువురు వైసిపి నాయకులు టిడిపిలో చేరారు. చెన్నేకొత్తపల్లి మండలంలోని వైసిపికి చెందిన 30కుటుంబాలు అనంతపురం లోని పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో మంగళవారం టిడిపిలో చేరాయి. వారందరికీ పరిటాల సునీత టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలోని వెల్దుర్తి, నాగసముద్రం గ్రామాలకు చెందిన మాజీ సర్పంచి వీరజిన్నప్ప, వార్డు మెంబర్‌ చంద్రశేఖర్‌, రామాంజనేయులు, చిన్ని బాబయ్య, ఓబులేసు, పెద్ద బాబయ్య, కల్లి పోతన్న, వెట్టి నారాయణ, నారాయణ, నారాయణస్వామి, మారుతి, శ్యామల, కార్తీక్‌, హరీష్‌ బాబు, ఓంప్రసాద్‌, సల్లప్ప, కందుకూరి ఆదెప్ప తదితరలు పార్టీలో చేరారు. వైసీపీ విధానాలు, ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి తీరుతో విసిగిపోయి తాము టీడీపీలో చేరినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ కొత్తగా పార్టీలోకి వచ్చామన్న భావన వద్దని.. అందరితో కలసి టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు.

➡️