ప్రజాసేవలోనూ భాగస్వామ్యం కావాలి

కలెక్టర్‌కు పరికరాల పత్రాన్ని అందజేస్తున్న కంపెనీ ప్రతినిధులు

          పుట్టపర్తి అర్బన్‌ : ప్రభుత్వ రంగ సంస్థలు తమకు వచ్చే లాభాల్లో కొంత మొత్తం ప్రజాసేవకు వినియోగించాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో కియో కంపెనీ అనుబంధ సంస్థ హైనోడా హయోబిస్‌ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కంపెనీలు ఇచ్చే సిఎస్‌ఆర్‌ కార్యక్రమాలు విస్తతపరచాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలకు ఉపయోగపడే రూ.44,13,436 విలువగల పరికరాలను కంపెనీ ప్రతినిధులు అందజేశారు. అనంతరం ఐసిడిఎస్‌ పీడీ లక్ష్మి కుమారి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు ఏ వయసులో ఎంత బరువు ఉన్నారో తెలుసుకునే బరువు కొలమాన యంత్రాలు, పెద్దలు బరువు కొలిచే యంత్రాలు, స్టేడియో మీటర్‌ పరికరాలు అందజేశారాన్నరు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్యతో పాటు కంపెనీ ప్రతినిధులు హుస్‌ మిన్‌ మేనేజర్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️