రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు ప్రారంభం

శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న రైల్వే శాఖ రాజీవ్‌ శర్మ, వైసిపి ఇన్‌ఛార్జి దీపిక, ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ తదితరులు

            హిందూపురం, ధర్మవరం టౌన్‌ : జిల్లాలోని హిందూపురం, ధర్మవరం రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులను ప్రారంభం అయ్యాయి. అమృత్‌ భారత్‌ స్టేషన్‌లో భాగంగా సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌ విధానం ద్వారా ఈ పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా హిందూపురం రైల్వేస్టేషన్‌లో రూ.23.97 కోట్లతో స్టేషన్‌ ఆధునికరణ పనులను మొదలు పెట్టారు. పనులకు సంబంధించిన శిలలాఫలకాన్ని రైల్వే శాఖ డిఈఈఎన్‌ రాజీవ్‌ శర్మ, వైసిపి ఇన్‌ఛార్జి దీపిక, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.విష్ణువర్ధన్‌ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని పాంచజన్య పాఠశాలకు చెందిన విద్యార్థినులు స్నేహశ్రీ, రేణుప్రియ, హిందూపురం రూరల్‌ మండలం ఎల్‌ఆర్‌జి విద్యార్థినులు అస్మా, ధారిఖలు రైల్వే విస్తరణ, అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రసంగించారు. రైల్వే శాఖ డిప్యూటీ సిఎస్‌టిఈ శ్రీనివాస్‌ రావు, అధికారులు సోమప్ప, ఆనంద్‌, సతీష్‌ రెడ్డి, నాగలింగ పాల్గొన్నారు. ధర్మవరం రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులుధర్మవరం టౌన్‌ : అమత్భారత్‌ కార్యక్రమం కింద ధర్మవరం రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులకు వర్చువల్‌ ద్వారా ప్రధాని నరేంద్రమోడీ సోమవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్‌ ఆవరణంలో ప్రత్యేక సమావేశాన్ని రైల్వే అధికారులు ఏర్పాటుచేశారు. రూ.8.64కోట్లతో ధర్మవరం రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తామని రైల్వే అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత దళవాయి చలపతిరావు, బిజెపి జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు అంబటిసతీశ్‌ కుమార్‌, జాతీయ అవార్డు గ్రహీత, తోలుబొమ్మలాట కళాకారుడు చిదంబరరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి గొట్లూరు చంద్ర, ధర్మవరం రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ చల్లా నరసింహనాయుడు, ఆర్‌పిఎఫ్‌ సిఐ బోయకుమార్‌, జీఆర్పీ సిఐ నాగరాజు, ఎస్‌ఐ గోపికుమార్‌, వన్‌టౌన్‌ సిఐ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

➡️