విద్యార్థులా.. పనిమనుషులా..?

Apr 1,2024 22:49

వాటర్‌క్యాన్‌ మోసుకుని వెళుతున్న విద్యార్థులు

                    లేపాక్షి: మండలంలోని మహాత్మా జ్యోతి బాపూలే పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు పనిమనుషులుగా మార్చుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ, ఎఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాబావలి, చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులను కించపర్చుతూ మాట్లాడుతున్నట్లు విడియోలు బయటకు రావటంతో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు సోమవారం పాఠశాలను సందర్శించారు. ఈ క్రమంలోనే ఇక్కడ విద్యార్థులు వాటర్‌క్యాన్లు మోస్తూ కన్పించారు. దీంతో నాయకులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారా లేక స్కూల్లో పనులు చేయడానికి వచ్చారా అని ప్రశ్నించారు. విద్యార్థుల దగ్గర పనులు చేయించిన వారిపై ఉన్నత విద్యాశాఖ అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️