శాస్త్రీయ ఆలోచనతోనే సామాజిక మార్పు

          కదిరి టౌన్‌ : శాస్రీయ ఆలోచనతోనే సామాజిక మార్పు సాధ్యమని ప్రముఖ చిన్నపిల్లలు డాక్టర్‌ మదన్‌కుమార్‌ తెలిపారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్జీవో హోంలో జిల్లా ఉపాధ్యక్షులు బి.నరసారెడ్డి అధ్యక్షతన పిళ్లా కుమారస్వామి రచించిన ‘శాస్త్రీయ ఆలోచన’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్‌ సివి.మదన్‌కుమార్‌, న్యాయవాది నరసింహులు, యుటిఎఫ్‌ నాయకులు శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, ఎల్‌ఐసి ఏజెంట్ల సంఘం నాయకులు బయప్ప, జెవివి జిల్లా అధ్యక్షులు ఆదిశేషు, ఇంద్రజాలకులు నబి, రచయిత పిళ్లా కుమారస్వామి, పెన్షనర్ల సంఘం నాయకులు వీరస్వామి పాల్గొన్నారు. నర్సారెడ్డి మాట్లాడుతూ జెవివి ఆధునిక ప్రపంచంలో మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యం చేయడానికి వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తుందన్నారు. మ్యాజిక్‌ ఫైర్‌ ప్రదర్శించి ప్రేక్షకులను ఆశ్చర్య చకితుల్ని చేశారు. అనంతరం సైన్సు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీరస్వామి, సైంటిస్ట్‌ చండ్రాయుడు, సాహితీ స్రవంతి నాయకులు రాజశేఖర్‌, కదిరి అభివృద్ధి వేదిక నాయకులు చింతా శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు సుబ్బిరెడ్డి, సిపిఎం నాయకులు నరసింహులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాబ్‌జాన్‌, సిఐటియు నాయకులు యాకూబ్‌ఖాన్‌ పాల్గొన్నారు.

➡️