సిఎం జగన్‌ పర్యటన భద్రతా ఏర్పాట్ల పరిశీలన

సిఎం జగన్‌ విడిది కేంద్రం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎస్సీ మాధవరెడ్డి

            బత్తలపల్లి : ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో జిల్లాలో నిర్వహిస్తున్న బస్సుయాత్రకు సంబంధించి బందోబస్తు, భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ మాధవరెడ్డి సమీక్షించారు. బత్తలపల్లిలో జగన్‌ విడిది కేంద్రం వద్ద ఏర్పాట్లను శనివారం ఎస్పీ పరిశీలించి అక్కడి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ చేరుకుని పరిస్థితులపై సమీక్షించారు. రెండు రోజుల పాటు తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలపై అడిషనల్‌ ఎస్సీ విష్ణుప్రసాద్‌, డీఎస్సీ శ్రీనివాసులు, ధర్మవరం రూరల్‌ సిఐ ఆరోహణరావు. ఎస్‌ఐ శ్రీనివాసులుతో చర్చించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్లో కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు చేశారు. ఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో కొనసాగే సిఎం జగన్‌ బస్సుయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బస్సుయాత్రలో ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిద్ధం చేశామన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కేతిరెడ్డిమండలంలోని సంజీవపురం సమీపంలో ఏర్పాటు చేసిన సిఎం జగన్‌ విడిది కేంద్రం వద్ద ఏర్పా ట్లను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, తదిత రులు పరిశీలించారు. వారితో పాటు గుర్రం శ్రీనివాస్‌, మండల కన్వీనర్‌ మాదిరెడ్డి జయరామిరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి ఉన్నారు.

➡️