హ్యాండ్‌లూమ్‌ను కాపాడమే టీడీపీ లక్ష్యం

Feb 11,2024 22:11

సమావేశంలో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

                              ధర్మవరం టౌన్‌ : చేనేతల ఆత్మహత్యలు లేని ధర్మవరంగా చూడాలని, హ్యాండ్‌ లూమ్‌ ను కాపాడటమే టీడీపీ లక్ష్యమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాలశ్రీరామ్‌ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఈనెల 14న ధర్మవరానికి రానున్న నేపథ్యంలో చేనేతలతో స్థానిక టీడీపీ కార్యాలయంలో పరిటాలశ్రీరామ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14న ధర్మవరంలోని మారుతీరాఘవేంద్రస్వామి పంక్షన్‌హాల్‌లో చేనేతలతో భువనేశ్వరి సమావేశం కానున్నట్లు తెలిపారు. ధర్మవరం చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు భువనేశ్వరి దృష్టికి తీసుకెళ్తామన్నారు. 14న జరగబోయే సమావేశానికి పెద్దఎత్తున తరలిరావాలని పరిటాలశ్రీరామ్‌ పిలుపు నిచ్చారు.

➡️