101 జీవోను పునరుద్ధరించాలి

Oct 11,2024 21:14

సమావేశంలో పాల్గొన్న నాయకులు

                     పుట్టపర్తి రూరల్‌ : 101 జీవోను వెంటనే పునరుద్ధరించాలని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల గ్రహీతల సంఘం అధ్యక్షులు, ఎంఇఒ బొల్లె ప్రసాద్‌ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో రాష్ట్ర జాతీయ అవార్డుల గ్రహీతల సంఘం ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. 101 జీవోను పునరుద్ధరించి అవార్డు గ్రహీతలకు రాయితీలపై బస్సు, రైల్వే పాసులు, ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో పలు సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని అలానే మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని అన్నారు. వీటిపై రాష్ట్ర, జిల్లా, విద్యాశాఖకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో అనంతపురం జిల్లా సంఘం ప్రతినిధి ఎంనారాయణస్వామి, ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం, రిటైర్డ్‌ ప్రధాన ఉపాధ్యాయులు అబ్దుల్‌ రహిమాన్‌, ఎం జగదీష్‌, శంకర్‌ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️