జనంపై అదానీ ‘పేలుడు’

Feb 2,2025 22:12

కర్మాగారం ఏర్పాటుకు చేపట్టిన నిర్మాణాలు

                  తాడిమర్రి :మండల పరిధిలోని పెద్దకోట్ల చిలకొండయ్యపల్లి గ్రామ సరిహద్దుల్లో అదానీకంపెనీ వారు నిర్మిస్తున్న విద్యుత్‌ కర్మాగారం వల్ల పెద్దకోట్ల, దాడి తోట, చిలకొండపల్లి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడను పేలుస్తున్న పేలుడు ధ్వని వల్ల ఏ సమయంలో ఎలాంటి ఉపద్రవం సంభవిస్తుందోనని ఆందోళనకు గురి అవుతున్నారు, రాత్రి సమయాల్లో పని చేస్తున్న భారీ యంత్రాల శబ్దానికి ప్రజలకు నిద్ర లేకుండా పోతోందని మూడు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాలకు ఎటువంటి హాని లేని పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

 

➡️