అంతర్జాతీయ చెస్‌ టోర్నీ విజేత అఫ్రిద్‌ఖాన్‌

Jun 10,2024 21:45

 ఆఫ్రిద్‌ఖాన్‌ను సన్మానిస్తున్న దృశ్యం

                 హిందూపురం : జూన్‌ 4 నుంచి 9 వరకు భీమవరంలో జరిగిన అంతర్జాతీయ ఓపెన్‌ చదరంగం పోటీలలో హిందూపురం స్పార్టన్‌ చెస్‌ అకాడమీ క్రీడాకారుడు ఆఫ్రిద్‌ఖాన్‌ ప్రతిభ కనపర్చి టోర్నమెంట్‌ విజేతగా నిలిచాడు. నిర్వాహకులు విజేతకు రూ.60 వేలు నగదుతో పాటు ట్రోఫీ అందజేశారు. ఈ పోటీలలో 270 జాతీయ అంతర్జాతీయ చెస్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో పది గేములకు గాను ఆరు గెలిచి నాలుగు గేములు డ్రా చేసుకొని మొత్తం 8 పాయింట్స్‌ సాధించిన ఆఫ్రిద్‌ఖాన్‌ మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ చెస్‌ అకాడమి సెక్రటరీ భీమారావు, చీఫ్‌ ఆర్బిటర్‌ ఉదరు కుమార్‌ నాయుడు క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో చెస్‌ లో రాణించిన ఆఫ్రిద్‌ఖాన్‌ను, చెస్‌ కోచ్‌ అరిఫుల్లా అభినందించారు.

➡️