నేడు అహుడా ఛైర్మన్ టిసి.వరుణ్
ప్రజాశక్తి-అనంతపురం
జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్ అహుడా ఛైర్మన్ హోదాలో గురువారం మొదటిసారి అనంతపురం నగరానికి వస్తున్నారు. దీంతో జిల్లా సరిహద్దుల్లోని బాటలో సుంకులమ్మ ఆలయం వద్ద నుంచి టిసి.వరుణ్‌కు స్వాగతం పలికేందుక జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు 300 వాహనాలతో భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 9:30 గంటలకు టిసి.వరుణ్ బాటలో సుంకులమ్మ ఆలయం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి భారీ కాన్వారుగా సోములదొడ్డి ఆంజనేయస్వామిసర్కిల్, శ్రీ7 కన్వెన్షన్ హాల్, గుత్తి రోడ్డు ఐదు లైట్ల సర్కిల్, పాతూరు గాంధీ సర్కిల్, శ్రీకంఠం, కొత్తూరు జూనియర్ కళాశాల, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా క్లాక్ టవర్ చేరుకుంటారు. అక్కడ భారీ గజమాలతో వరుణ్‌కు స్వాగతం పలకనున్నారు. సప్తగిరి సర్కిల్, ప్రభుత్వాసుపత్రి, అంబేద్కర్ ఫై ్లఓవర్ మీదుగా అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ నివాసానికి భారీ ర్యాలీగా చేరుకుంటారు. మధ్యాహ్నం అక్కడ భోజనం ఏర్పాట్లు చేశారు. మరోవైపి టిసి.వరుణ్‌కు భారీ స్వాగతం పలికుతూ నగరంలోని ప్రధాన కూడల్లు, రహదారుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.