బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా నియోజకవర్గంలోని చెరువులన్నింటిని నీటితో నింపాలి

Mar 19,2025 22:06

నిరుపయోగంగా ఉన్న పంప్‌హౌన్‌ను చూపిస్తున్న నాయకులు

                         మడకశిర : గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి మడకశిర బ్రాంచి కెనాల్‌ ద్వారా నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ నీటితో నింపాలని ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హరి, జిల్లా కమిటీ నాయకులు సోమకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు నిరుపయోగంగా ఉన్న గొల్లపల్లి పంప్‌ హౌస్‌ను బుధవారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి మడకశిర కు బ్రాంచి కెనాల్‌ ఏర్పాటు చేసి, సాగు, తాగు నీరు కోసం చెరువులకు నీటిని సరఫరా చేస్తామని, అప్పటి టిడిపి ప్రభుత్వం, ఆ తరువాత వచ్చిన వైసిపి ప్రభుత్వం చెప్పాయన్నారు. ఇప్పటి వరకు అరకొరగా రెండు సార్లు మాత్రమే బ్రాంచి కెనాల్‌కు నీటిని వదిలారన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేసే ప్రభుత్వాలు , రైతులకు ఉపయోగపడే, వందల కోట్లు ఖర్చు తో పూర్తి ఆయ్యే మడకశిర బ్రాంచి కెనాల్‌ పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. రైతులను, పాడిపరిశ్రమను ఆదుకోవాలని నిరూపయోగంగా వున్న పుంప్‌హౌస్‌లను ఉపయోగంలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో, వేమారెడ్డి , రంగనాథ్‌ పాల్గొన్నారు.

➡️