నియోజకవర్గంలో రోడ్లన్నీ బాగు చేస్తాం : ఎమ్మెల్యే

పూర్తయిన రోడ్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

ప్రజాశక్తి-చెన్నేకొత్తపల్లి

నియోజకవర్గంలో రోడ్ల సమస్యలు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. రామగిరి మండలంలో ముత్యాలంపల్లి నుంచి వెంకటాపురం వరకూ జరుగుతున్న రోడ్డు పనులను గురువారం ఎమ్మెల్యే సునీత ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌తో కలిసి పరిశీలించారు. సుమారు 4.5 కి.మీ. మేర ఉన్న ఈ మార్గంలో రూ. 75 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులు చేపట్టారు. ఇప్పటికే పనులు దాదాపు పూర్తయ్తిన నేపథ్యంలో వారు రోడ్డు నాణ్యతను పరిశీ లించారు. పనుల నాణ్యతలో రాజీ పడవద్దన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ముత్యాలంపల్లిలో పరి టాల రవీంద్ర నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని పరిశీలించి మరమ్మతులు చేయించాలని చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎగువపల్లి నుంచి పిఆర్‌.కొట్టాల వరకూ రోడ్డు మరమ్మతులకు గురైన నేపథ్యంలో దాదాపు రూ. 2.7 కోట్ల వ్యయంతో త్వరలోనే నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పేరూరు ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న చెరువును పరిశీలించారు. ఇక్కడ ట్యాంక్‌ బండ్‌ తరహాలో అభివృద్ధి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. వాల్మీకి, కనకదాసు, టిప్పుసుల్తాన్‌, శ్రీకృష్ణదేవరాయలు, అంబేద్కర్‌ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయా సామాజిక వర్గాల ప్రజలు విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ గత ఐదేళ్లుగా గ్రామాల్లో ప్రజలు రోడ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లకు మోక్షం వచ్చిందన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఇంకా చాలా ప్రాంతా ల్లో రోడ్లు వేయాల్సి ఉందని ప్రధాన్యతా క్రమంలో పనులు చేపడుతామని తెలిపా రు. వారి వెంట స్థానిక టిడిపి నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు ఉన్నారు.

➡️