స్పోర్ట్స్ మీట్‌లో ద్విచక్రవాహనంపై ప్రదర్శన చేస్తున్న శ్రీసత్యసాయి విద్యా సంస్థల విద్యార్థులు
ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్
సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థులు నిర్వహించిన క్రీడా విన్యాసాలు అబ్బురపరిచాయి. శనివారం సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో ప్రశాంత్ నిలయం, బందావన్, ముద్దులహళ్లి, అనంతపురం విద్యార్థులు విన్యాసాలు చేశారు. ప్రతి ఏటా జనవరి 11న ఈ క్యాంపస్ విద్యార్థులు స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్టేడియంలో వివిధ దేశాల పథకాలతో సుందరంగా అలంకరించారు. సత్యసాయి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాఘవేంద్రరావు, ట్రస్టు సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. మొదట విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. విద్యార్థులు సాహసోపేత క్రీడా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10-30 గంటల వరకు ఈ క్రీడా విన్యాసాలు జరిగాయి. మోటార్ సైకిల్ విన్యాసాలు, అగ్గి ంటల్లో బైక్ చేజింగ్, ఒంటి చక్రంపై విన్యాసాలు, జిమ్నాస్టిక్, లాంగ్ జంప్, కారుపై ఎగరడం, దశావతార నత్యం, భారత రామాయణ ఇతివత్తం నత్యాలు, గోపికలతో కృష్ణుడు నత్యం తదితర భారతీయ సంస్కతి ఉట్టిపడే విధంగా విన్యాసాలు చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈశ్వరమ్మ హైస్కూల్, వైట్ ఫీల్డ్ నర్సింగ్ పాఠశాల, బందావన్ క్యాంపస్, చిన్నారులు చేసిన వివిధ రకాల నత్యాలు ఆహుతులను అలరించాయి. స్పోర్ట్స్ మీట్ తిలకించడానికి పట్టణ ప్రజలే కాకుండా దేశ విదేశీయులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెటర్నల్ క్రికెట్ ప్లేయర్ కాలి చరణ్, శాసనసభ్యురాలు పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.