పెనుకొండ ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆనంద్‌కుమార్
పెనుకొండ : పెనుకొండ రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఆనంద్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హిందూపురం తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్ కుమార్ ఉద్యోగోన్నతిపై పెనుకొండ ఆర్డీవోగా వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, పరిగి, పెనుకొండ, లేపాక్షి తహశీల్దార్లు హసీనా సుల్తానా, వరలక్ష్మి, శ్రీధర్ తదితరులు అభినందనలు తెలిపారు.