12న ఆంధ్ర బాడీ బిల్డింగ్‌ పోటీలు

Apr 14,2025 21:54

పోస్టర్లు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే , తదితరులు 

                  కదిరి టౌన్‌: కదిరిలో పివిఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మే 12న నిర్వహించే మిస్టర్‌ ఆంధ్ర క్లాసిక్‌ స్పోర్ట్స్‌, బాడీ బిల్డింగ్‌, మాస్టర్స్‌ ఛాంపియన్షిప్‌ 2025 పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట మాట్లాడుతూ రాష్ట్ర బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ సహ కారంతో నిర్వహించే ఈ పోటీల్లో అన్ని జిల్లాలలో నుండి బాడీబిల్డర్లు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి డిస్టిక్‌ బాడీ బిల్డింగ్‌, ఫిట్నెస్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షులు, లోటస్‌ జిమ్‌ నిర్వాహకులు రమేష్‌, లోటస్‌ జిప్‌ సభ్యులు సురేష్‌ రెడ్డి, శ్రావణ్‌ రెడ్డి,హనీస్‌, అతావుల్లా,అద్దూ, లక్కీ, అబ్దుల్‌, బషీర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️