అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

Mar 10,2025 21:33

నిరసనలో పాల్గొన్న అంగన్వాడీలు, నాయకులు

                  ధర్మవరం రూరల్‌ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో మహేష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్‌ జెవి. రమణ, కో కన్వీనర్‌ టి.అయూబ్‌ ఖాన్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ కార్యదర్శి డి. చంద్రకళ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. కనీస వేతనం అమలు చేయడం లేదన్నారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల యూనియన్‌ నాయకులు పోతక్క, దీన, సునీత, ఫాతిమా, చింతమ్మ, అరుణ, లక్ష్మీదేవి, గోవిందమ్మ, వేదవతి, గంగరత్న, చిట్టెమ్మ, సరస్వతి, ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.

➡️