ఆసుపత్రిలోని పరీక్షల విభాగాన్ని పరిశీలన చేస్తున్న జిల్లా వైద్యాధికారిణి మంజువాణి
ప్రజాశక్తి-హిందూపురం
హిందూపూరం రూరల్ పరిధిలోని చౌళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారిణి మంజువాణి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలియ తిరిగి కాన్పుల వార్డు, రోగుల వార్డు. ల్యాబ్ రూమ్‌లను క్షుణంగా పరిశీలించారు. అనంతరం సిబ్బంది హాజరు పట్టిక, ఓపి వివరాలను చూశారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ వాటి నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు బివి.చంద్రశేఖర్, శాంతకుమారి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.