వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
పెనుకొండ టౌన్ : ఆశ వర్కర్స్ యూనియన్, సిఐటియు రాష్ట్ర ప్రతినిధి వర్గంతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాలకు సంబందించిన జీవోలు,సర్కులర్ వెంటనే విడుదల చేయాలపి సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి సౌమ్య,గుట్టూరు పి హెచ్ సి వైద్యాధికారి నాగరాజు నాయక్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ 9 నెలలు కావస్తున్న జీవోలు విడుదల కాకపోవడంతో ఆశ వర్కర్లు తీవ్ర ఆందోళన గురవుతున్నారన్నారు. ఈ మధ్యకాలంలో అనేకమంది ఆశ వర్కర్లు రిటైర్డ్ అయ్యారని చెప్పారు. రిటైర్డ్‌మెంట్ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంపుదల జీవో రాకపోవడంతో ఆశ వర్కర్లు తీవ్ర ఆందోళన గురవుతున్నారని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అందలేదని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ నాయకురాలు తులసి, అలివేలమ్మ, రాజేశ్వరి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసంఘం నాయకులు కమల్ బాషా ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైద్యాధికారికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలపై కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు యూనియన్ నాయకులతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోను వెంటనే విడుదల చేయాలన్నారు, ఒప్పందం జరిగి 9 నెలలు కావస్తున్న ఇప్పటివరకు జీవో విడుదల కాకపోవడంతో ఆశ వర్కర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. రిటైర్డ్ అయిన వారికి బెనిఫిట్స్ అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు పాల్గొన్నారు.