పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలి: సిఐటియు

Feb 3,2025 21:24

 కమిషనర్‌తో మాట్లాడుతున్న నాయకులు

                      ధర్మవరం రూరల్‌ : ధర్మవరం మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని సిఐటియు నాయకులు కోరారు. ఈ మేరకు ఆసంఘం నాయకులు సోమవారం స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు .జెవి. రమణ టీ.అయూబ్‌ ఖాన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న కంటెంజెంట్‌ ఆయాలకు అక్టోబర్‌ నెల నుంచి ఇప్పటివరకు వేతనాలు రాకపోవడంతో వారి కుటుంబాలు అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నాయన్నారు. చాలీచాలని వేతనాలతో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారని, వారి కుటుంబాలు పోషించుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్నా అతి తక్కువ వేతనం కేవలం 4వేల రూపాయలతో వారు చాలా కష్టాల పాలవుతున్నారని ఇటువంటి చిరు ఉద్యోగులకు ప్రతినెల ఐదో తారీకు లోపు వేతనాలు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన కమిషనర్‌ రెండు రోజులలోపు వారి వేతనాలను మంజూరయ్యేటట్లు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎల్‌ ఆదినారాయణ, ఎస్‌. హైదర్‌ వలి, స్కూలు ఆయాల కమిటీ నాయకులు. చౌడమ్మ, జయమ్మ, ప్రమీల, నాగలక్ష్మి ,నాగరత్న, నాగమ్మ, గంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️