వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
ఓబుళదేవర చెరువు : విఒఎల విధులకు ఆటంకాలు, తొలగింపులకు గురి చేస్తున్న సీసీలపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్, లక్ష్మినారాయణ, కుళ్లాయప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఏసీ రవీంద్రకు తమ డిమాండ్లతో కూడిన వినిత పత్రాన్ని అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనార్టీకి చెందిన వారు 10 నుండి 18 సంవత్సరాలుగా వివోఏలుగా పనిచేస్తున్నారన్నారు. వారిని విధుల నుండి తప్పుకోవాలని సీసీలు వేధిస్తున్నానన్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్ నుండి విఒఎల పేర్లు తొలగించి, గ్రామైక్య సంఘాల గ్రూపుల నందు బలవంతంగా వివోఏ గా తొలగింపునకు తీర్మానాలు చేయించేందుకు ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. సీసీలు అధికార పార్టీ నాయకులకు పరోక్షంగా పనిచేస్తున్నారన్నారు. విఒఎల విధుల పట్ల ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ గ్రామైఖ్య సంఘాల అనుమతులు నియమ నిబంధనలకు ప్రభుత్వ సూచనలకు పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సీసీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు వివోఏలు రంగులాల్, శశికళ, అంజి, వెంకటరమణ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.