కమిషనర్ కు పుష్బ గుచ్చం అందించి అభినందిస్తున్న బాలకృష్ణ పిఎ బాలాజి, టిడిపి కౌన్సిలర్లు
ప్రజాశక్తి-హిందూపురం
పురపాలక సంఘ వ్యాప్తంగా ఆదాయంతో పాటు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులు రావు తెలిపారు. అనంతపురం కార్పొరేషన్‌లో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సంఘం శ్రీనివాసులు హిందూపురం కమిషనర్‌గా బదిలీపై వచ్చి, శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే ఆదాయం, పారిశుధ్యం నిర్వహణపైనే ఆధారం అన్నారు. మున్సిపాల్టీకి ఆదాయాన్ని పెంచి ప్రజలకు మౌలిక వసతుల కల్పినకు కృషి చేయనున్నట్లు చెప్పారు. బాధ్యతలను స్వీకరించిన కమిషనర్‌కు ఎమ్మెల్యే బాలకృష్ణ పిఎ బాలాజీ, టిడిపి కౌన్సిలర్లు, మున్సిపల్ కాంట్రాక్టర్లు, మున్సిపల్ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.