సదస్సును జయప్రదం చేయండి

Apr 14,2025 21:52

కరపత్రాలను పంపిణీ చేస్తున్న నాయకులు

                  నంబుల పూలకుంట : సోలార్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయడం వలన ఎదురయ్యే సమస్యలపై ప్రజలతో చర్చించడానికి నిర్వహించే సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి కోరారు. మండల పరిధిలోని మర్రి కొమ్మదిన్నె ఎర్ర వంకల వాండ్లపల్లి , జవుకుల గ్రామాల్లో సోమవారం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ తేదీ శుక్రవారం జవుకుల గ్రామంలో నిర్వహించే సదస్సుకు సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రభాకర్‌ రెడ్డి హాజరవున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు రైతు సోదరులందరూ హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలనికోరారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి, ఈశ్వర్‌ రెడ్డి, సిఐటియు నాయకులు నాగరాజుతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

➡️