బాధితురాలికి సిపిఎం పరామర్శ

Dec 11,2024 22:38

 బాధితురాలితో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

                 కొత్తచెరువు : కొత్త చెరువు మండల సమాఖ్య అధ్యక్షురాలి ఎంపిక విషయంలో జరిగిన ఘటనలపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన స్థానిక బీసీ కాలనీకి చెందిన నాగమణిని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈఎస్‌ వెంకటేష్‌, సిపిఎం నాయకులు పరామర్శించారు. అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చారు. ఒళ్లంతా బొబ్బలు వచ్చి నడవలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్న తనను సొంత పార్టీ వారు ఇప్పటివరకు స్పందించి పలకరించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈ ఎస్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ మొత్తం 43 సంఘాల లీడర్లను పిలిపించి ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో ఎన్నికలు జరిపి మెజార్టీ అభిప్రాయం మేరకు అధ్యక్షులను ఎన్నిక చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నాగమణికి అన్ని విధాల న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముత్యాలు, బ్యాల్లఅంజి, వెంకటరాముడు, వెంకటేష్‌, కేశప్ప, వ్యవసాయ కార్మిక సంఘం కోశాధికారి వెంకటేష్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి నాగమణి, సభ్యులు శ్రావణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️