రేపు ‘డాకు మహారాజ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

ఎస్పీతో కలిసి ఏర్పాట్లను పరిశీలిస్తున్న నందమూరి అభిమాన సంఘాల నాయకులు

ప్రజాశక్తి అనంతపురం

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌ చిత్రం ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఈ నెల 9వ తేదీన అనంతపురం నగరంలో నిర్వహిస్తున్నారు. నగర పరిధిలోని శ్రీనగర్‌ కాలనీ అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ జగదీష్‌, చిత్ర యూనిట్‌, నియోజకవర్గ టిడిపి నాయకుడు గంగారామ్‌, ఎన్‌బికె హెల్పింగ్‌ హాండ్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్‌, నందమూరి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు గౌస్‌ మొద్దీన్‌ తదితరులు మంగళవారం పరిశీలించారు. ఈవెంట్‌లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకునేలా అధికారులు, నందమూరి అభిమాన సంఘాల నాయకులు చర్యలు తీసుకుంటున్నారు.

➡️