ప్రజాశక్తి-హిందూపురం : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం చౌడేశ్వర్ కాలనీలో భోగిమంటల్లో విద్యుత్ బిల్లులను తగలబెడుతున్న కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ సరస్వతమ్మ, గంగమ్మ లక్ష్మీదేవమ్మ, అలివేలమ్మ, శోభ రామలక్ష్మమ్మ, గులాబ్ జాన్, నారాయణప్ప, కదిరప్ప, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ ట్రూ ఆఫ్ కరెంటు చార్జీలు వందలాది రూపాయలు కట్టలేక పేదలు ఇబ్బంది పడుతున్నారని చార్జీలు తగ్గించాలని ఆదా అనే అంబానీలకు దోచి పెట్టే దానికోసం స్మార్ట్ మీటర్లు బిగించి చిన్న సన్నకారు రైతులకు అధిక బిల్లులు వస్తున్నాయి. కాబట్టి స్మార్ట్ మీటర్లు తొలగించాలని దళితులు ఎక్కడున్నా ఉచిత కరెంటు ఇవ్వాలని ఈరోజు భోగిమంటల్లో విద్యుత్ పిల్లలను కుల వ్యవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో తగలబెట్టారు. అదేవిధంగా మేలాపురంలో గంగమ్మ గారి ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులు తగలబెట్టడం జరిగింది. ప్రభుత్వం స్పందించి వెంటనే విద్యుత్ బిల్లులు తగ్గించి స్మార్ట్ మెంటల్ తొలగించాలని కెవిపిఎస్ గా డిమాండ్ చేశారు.
