ముందస్తు అడ్మిషన్ల పై చర్యలకు డిమాండ్‌

Feb 3,2025 21:25

ఎంఇఒకు వినతిపత్రం ఇస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

                    హిందూపురం : విద్యా సంవత్సరం ఇంకా కొనసాగుతుండగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రీ ప్రైమరీ యూకేజీ, ఎల్‌ కేజీలను నడుపుతున్న కార్పొరేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం మండల విద్యాశాఖ అధికారి గంగప్ప, మండల పరిషత్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మహేష్‌, మంజునాథ్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

➡️