యువతతోనే అభివృద్ధి : ఎమ్మెల్యే

Nov 27,2024 21:45

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట  

                      కదిరి టౌన్‌ : యువతతోనే అభివృద్ధి సాధ్యమని యువతీ యువకులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటేనే సమాజానికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. బుధవారం కదిరి రూరల్‌ పరిధి ఎర్రదొడ్డి గంగమ్మ మోరి వద్ద ఉన్న బ్లూ మూన్‌ కళాశాలలో యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్‌ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌, ఆర్డీవో శర్మ , జిల్లా యువకేంద్రం అధికారి కె .మణికంఠ , నెహ్రూ యువ కేంద్ర కార్యక్రమ అధికారి జి. శ్రీనివాసులు, జాతీయ యువజన అవార్డు గ్రహీత బిసాతి భరత్‌, బ్లూమూన్‌ విద్యాసంస్థల అధినేత శివశంకర్‌ డాక్టర్‌. మదన్‌కుమార్‌ పాల్గొన్నారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంటుందన్నారు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని యువత నడుచుకోవాలన్నారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో కదిరిలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్‌ను నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఇందులో భాగంగా యువతకు సైన్స్‌ మేళా గ్రూప్‌ మరియు ఇండివిజువల్‌, మరియు యంగ్‌ రైటర్స్‌ కాంటెస్ట్‌ , యంగ్‌ ఆర్టిస్ట్‌ కాంటెస్ట్‌ ఫోటోగ్రఫీ కాంటెస్ట్‌ మరియు వర్క్‌ షాప్‌ ,డిక్లమేషన్‌, కాంటెస్ట్‌, మరియు జిల్లా గ్రూప్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌ నిర్వించారు . వివిధ పోటీలలో గెలుపొందిన యువతకు నగదు బహుమతి, కేంద్ర ప్రభుత్వం ప్రశంసా పత్రం అందించారు . ఈ కార్యక్రమంలో డాక్టర్‌ గరుగు బాలాజీ , ప్రిన్సిపల్‌ మనోహర్‌ రెడ్డి ఆన్‌సెట్‌ మేనేజర్‌ సునీల్‌ కుమార్‌ రెడ్డి , ఆఫీసు సిబ్బంది రూబీ ఖాన్‌, సాయి నాథ్‌, జాతీయ యువ కార్యకర్తలు వాసుదేవ్‌ , వెంకటేష్‌, బ్లూమూన్‌ కాళాశాల సిబ్బంది, యువతీ యువకులు పాల్గొన్నారు.

➡️