సమస్యలు వింటున్న జేసీ
పుట్టపర్తి అర్బన్ : సామాజిక పింఛన్ల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి 247 అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జేసీతో పాటు డిఆర్‌ఒ కొండయ్య, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, సచివాలయాల నోడల్ అధికారి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. దినపత్రికలో వచ్చే వార్త కథనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తగు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మంగళవారం పింఛన్ల పంపిణీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, పట్టు పరిశ్రమ జేడీ పద్మమ్మ, ఏపీఎం వైపి పీడీ సుదర్శన్, సిపిఒ విజరు కుమార్, హౌసింగ్ పీడీ వెంకటరమణారెడ్డి, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, సాంఘిక సంక్షేమ అధికారి శివరంగ ప్రసాద్, డిఎంహెచ్‌ఒ మంజువాణి తదితరులు పాల్గొన్నారు.