వక్ఫ్‌ సవరణ బిల్లుతో విఘాతం

రిలేదీక్షల్లో ప్రసంగిస్తున్న మాజీ ఎమ్మెల్సీ డా||గేయానంద్‌

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా ఉభయ సభలో ఏకపక్షంగా పాస్‌ చేయించుకున్న వక్ఫ్‌ సరవణ బిల్లుతో ముస్లిములకే కాక, రాజ్యాంగానికి తీవ్ర ప్రమాదం అని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు అభిప్రాయ పడ్డారు. వక్ఫ్‌ బిల్లును ఉప సంహరించుకోవాలని కోరుతూ యునైటెడ్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (యూజేఏసి) ఆధ్వర్యంలో టవర్‌క్లాక్‌ సర్కిల్‌ వద్ద రిలే నిరాహార దీక్షలను గురువారం ప్రారంభించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎ.చంద్రశేఖర్‌, సిటిజన్‌ ఫోరం నాయకులు, న్యాయవాది అబ్దుల్‌ రసూల్‌లు దీక్షలను ప్రారంభించారు. వక్ఫ్‌ బోర్డ్‌ మాజీ ఛైర్మన్‌ రిజ్వాన్‌, ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు వలి, ఇమామ్‌ బాషా, వైసిపి కార్పొరేటర్‌లు రహంతుల్లా, దాదు, ఇషాక్‌, జమాతే ఇస్లామిక్‌ హింద్‌ యాసీర్‌ అహ్మద్‌, ప్రజా సంఘం నాయకులు జాకీర్‌, ఇన్సాఫ్‌ నాయకులు ఖాజా హుస్సేన్‌, బంగారు బాషాలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వీరి దీక్షలకు నగర మేయర్‌ వసీం, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ ఫయాజ్‌ బాషా, ఉర్దూ అకాడమీ రాష్ట్ర మాజీ ఛైర్మన్‌ నదీం, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు దాదా గాంధీ, వైసిపి మైనార్టీ సెల్‌ బాకే హబీబుల్లా, ఎస్సీ, ఎస్టీ జేఏసి రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి, ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షులు మహబూబ్‌బాషాలు మద్దతుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వక్ఫ్‌ బోర్డు బిల్లును సవరిస్తూ ఉభయ సభల్లో ఆమోదం చేసుకుందన్నారు. వక్ఫ్‌ ఆస్తులు కార్పొరేట్‌ సంస్థలకు కొల్లకొట్టే కుట్రల్లో భాగమే చట్ట సవరణ చేస్తున్నారని విమర్శించారు. మతతత్వ విధానాలను రాజ్యాంగంలోకి చొప్పించి ముస్లింల హక్కులను హరించే చర్యలకు పాల్పడడం విచాకరం అన్నారు. వక్ఫ్‌ బిల్లును తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతవరకు లౌకికవాదులంతా ఏకమై కేద్రంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎండి ఇమామ్‌, ఆవాజ్‌ నాయకులు గులాం, హాజీవలి, రఫీ, రహంతుల్లా, శంషాద్‌, పాతిమా, మత పెద్దలు హరుణ్‌ రషీద్‌, ఫరీద్‌ పాల్గొన్నారు.

➡️