మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తున్న దృశ్యం
పుట్టపర్తి రూరల్ : గ్రామీణ మహిళలకు చేయూతనందించి వారిని ఆర్థిక పురోభివృద్ధి వైపు నడిపించడమే ప్రభాత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ లక్ష్యమని ఆ సంస్థ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి మండలం పరిధిలోని పెడపల్లి గ్రామంలో మంగళవారం పలువురు మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ప్రభాత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అవహాటా, స్టిట్టటంగ్ జర్మనీ వారి సహకారంతో బుక్కపట్నం, కొత్తచెరువు పుట్టపర్తి గ్రామాలకు చెందిన పిఆర్‌డిఎస్ టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు మంగళవారం మూడో విడతలో 47 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలలో గతంలో మొదటి విడతలో 27 మందికి రెండో విడతలో పదిమందికి మోటారుతో ఉన్న మిషన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. సత్యసాయి బాబా భక్తులు దక్షిణాఫ్రికాకు చెందిన లలితా జవ హీర్ లాల్ , స్కాట్లాండ్‌కు చెందిన యాంజెలా డెక్సవ్ , హాంకాంగ్ మీరియా చేతుల మీదుగా కుట్టు మిషన్లు అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్‌డిఎస్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, పద్మావతి, భారతి, టైలరింగ్ కోచ్ వినుత, కంటి నిపుణులు డాక్టర్ బషీర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.