యుటిఎఫ్‌ మోడల్‌ పేపర్లు పంపిణీ

రొద్దంలో యుటిఎఫ్‌ మోడల్‌ పేపర్లు పంపిణీ చేసిన ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-రొద్దం

మండలంలోని నారనాగేపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం పదో తరగతి విద్యార్థులకు యుటిఎఫ్‌ రూపొందించిన మోడల్‌ పేపర్లను పంపిణీ చేశారు. నారనాగేపల్లి గ్రామానికి చెందిన ధనుంజయ గౌడ్‌ కుమార్తె ఎల్లమ్మ సౌజన్యంతో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి జిసి.నరేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో హెచ్‌ఎం రామాంజనేయులు సమక్షంలో 30 మంది విద్యార్థులకు ఉచితంగా మోడల్‌ పేపర్లు పంపిణీ చేశారు. నరేష్‌కుమార్‌ మాట్లాడుతూ యుటిఎఫ్‌ ఉపాధ్యాయుల సమస్యలపైనే కాకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా నిష్ణాతులు, అనుభవుజ్ఞులైన ఉపాధ్యాయుల చేత మోడల్‌ పేపర్లు రూపొందించింద న్నారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాల ని సూచించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు సానిపల్లి గంగాధర్‌, ట్రెజరర్‌ ఎం.నరేష్‌, నాయకులు రాజశేఖర్‌, మహేష్‌, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

➡️