మొరాయించిన తాగునీటి సరఫరా మోటార్‌

అధికారులకు ఆదేశాలు ఇస్తున్న చైర్మేన్‌ రమేష్‌ కుమార్‌

ప్రజాశక్తి-హిందూపురం

హిందూపురం పట్టణానికి నీరు అందించే గొల్లపల్లి రిజర్వాయర్‌ వద్ద మోటార్‌ మొరాయించింది. శుక్రవారం తెల్లవారుజామున మోటార్‌ చెడిపోవడంతో హిందూపురానికి నీటి సరఫరా ఆగిపోయింది. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ ఛైర్మన్‌ డిఈ.రమేష్‌ కుమార్‌, కమిషనర్‌ సంఘం శ్రీనివాసులు అధికారులతో కలిసి గొల్లపల్లి రిజర్వాయర్‌, పంపు హౌస్‌లను పరిశీలించారు. సాంకేతిక నిపుణులతో మరమ్మతులపై చర్చించారు. అనంతపురం నుంచి మెకానిక్‌లను పిలిపించి మాట్లాడారు, వేసవికాలంలో ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా తక్షణ మరమ్మత్తులు చేయించాలని, అందుకు అవసరమైన సామాగ్రి, ఇతరత్రా వాటిని వెంటనే సమకూర్చనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ డిఈ మోహన్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు సతీష్‌ కుమార్‌, ఆయూబ్‌, దుర్గా నవీన్‌ పాల్గొన్నారు.

➡️