ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి

Mar 13,2025 22:02

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న నాయకులు

                       బుక్కపట్నం : ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో కూలీలు చేస్తున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వేసవి కాలంలో పని ప్రదేశంలో కనీసం నీటి సదుపాయం లేకపోవడం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా కేవలం ఫారం పాండ్‌ పనులు మాత్రమే ఉండడంతో కూలీలు పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు ఉపాధి హామీ కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️