పంచాయతీల అభివృద్ధిలో ఇఒఆర్‌డిలది కీలక పాత్ర

Nov 5,2024 21:42

సమావేశంలో మాట్లాడుతున్న డిపిఒ

                       పుట్టపర్తి రూరల్‌ : శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పంచాయతీలను అభివృద్ధి పరచడంలో ఈవోఆర్డీల పాత్ర కీలకమైందని శ్రీ సత్యసాయి జిల్లా పంచాయతీ అధికారి సమత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రామపంచాయతీల అభివృద్ధిపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపిఒ సమత, డిఎల్‌పిఒలు శివకుమారి, అంజనప్ప, శివ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా పరిధిలోని 32 మండలాల ఈవోఆర్డీలు, డిఎల్‌పిఒలు, మండల కోఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిపిఒ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కీలకమైందని గ్రామాల్లో పరిశుభ్రత పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఇంటి గుత్తలు, నూతనగృహాల నిర్మాణాల అనుమతులు తదితర విషయాలపై ఇఒఆర్‌డిలు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలం నుండి ఒక్కొక్క గ్రామ పంచాయతీని తీసుకొని దానిని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. పంచాయతీల రికార్డులు తనిఖీలు చేసి పిఆర్‌ యాప్‌లో హౌస్‌ టాక్స్‌ కలెక్షన్‌ తదితర అంశాలను అప్లోడ్‌ చేయాలన్నారు. ప్రతి నెల హౌస్‌ టాక్స్‌ లు ఎంత వసూలు చేస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలపాలన్నారు. హౌస్‌ టాక్స్‌ లు వసూలు కానీ ప్రదేశాలకు ఇఒఆర్‌డిలు, పంచాయతీ సిబ్బంది వెళ్లి వసూలు చేయాలన్నారు. అనంతరం పంచాయతీ నిధులు వినియోగం, అభివృద్ధి పనులపై అధికారులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇఒఆర్‌డిలు, జిల్లా పంచాయతీ సీనియర్‌ అసిస్టెంట్‌

➡️