హరియాన్‌చెరువులో లేఅవుట్‌ పరిశీలన

హరియాన్‌చెరువులో లేఅవుట్‌ను పరిశీలిస్తున్న రెవెన్యూ, పంచాయితీ అధికారులు

ప్రజాశక్తి-చెన్నేకొత్తపల్లి

మండలంలోని న్యామద్దెల పంచాయతీ పరిధిలోని హరియాన్‌చెరువు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన లేఅవుట్‌లను గురువారం మండల రెవెన్యూ, పంచాయతీ అధికారులు పరిశీలించారు. హరియాన్‌చెరువు గ్రామంలో కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా నిబంధన లకు విరుద్ధంగా లేఅవుట్‌ వేసినట్లు తెలుస్తోంది. దీంతో తహశీల్దార్‌ ఎన్‌.సురేష్‌ కుమార్‌, ఎంపిడిఒ శివశంకరప్ప ఆదేశాల మేరకు గురువారం ఆర్‌ఐ నరసింహ మూర్తి, గ్రామ రెవెన్యూ అధికారి విశ్వనాథ్‌రెడ్డి, విఆర్‌ఎ పెద్దన్న, న్యామద్దెల గ్రామ పంచాయతీ కార్యదర్శులు సుధాకర్‌రెడ్డి, రమణ హరియాన్‌చెరువు గ్రామంలో పర్యటించి లేఅవుట్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా బదలాయించకుండా, పంచాయతీ అనుమతి లేకుండా, నిబంధనల కు విరుద్ధంగా లేఅవుట్‌ వేశారని మండల స్థాయి అధికారులకు తెలిపారు. అయితే అనదికార లే అవుట్‌పై మండల, గ్రామ పంచాయితీ అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

➡️