నీటి సమస్యను పరిష్కరించండి

Apr 11,2025 21:42

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

                     కదిరి టౌన్‌ : పట్టణంలోని 33వ వార్డు మూర్తిపల్లిలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆపార్టీ నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్‌ డిఇ విజరుకుమార్‌కు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూర్తిపల్లి, ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వారం నుంచి తాగునీటి సమస్య నెలకొందన్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా ఆర్యవైశ్య శ్మశాన వాటిక నుండి మూర్తిపల్లి వరకు వీధిలైట్లు లేక రాత్రిపూట ఆ దారిగుండా వెళ్ళాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. మున్సిపల్‌ అధికారులు స్పందించి వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ నాయకులు రామ్మోహన్‌, జగన్మోహన్‌, ముస్తాక్‌ అలీ, ఆంజనేయులు, రఫిక్‌, సుధాకర్‌ రెడ్డి, ఉదరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️