ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన మాజీ మంత్రి

ప్రబుత్వ ప్రధాన కార్యదర్శితో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

ప్రజాశక్తి – పుట్టపర్తి రూరల్‌

విజయవాడలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ప్రదాన కార్యదర్వి విజయానంద్‌ను పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి మంగళవారం కలిసి పుష్పగుచ్చం అందజేశారు .ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారని, అధికార యంత్రాంగం అదే స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి, ఉమ్మడి అనంతపురం జిల్లా సమగ్ర అభివృద్ధికి తగిన తోడ్పాటు నివ్వాలని కోరారు.

➡️