కరపత్రాలను విడుదల చేస్తున్న ఎన్జీవో సంఘం నాయకులు
ప్రజాశక్తి -అనంతపురం
ఈ నెల 15న అనంతపురం ఎన్టీవో హోంలో ఉచిత వైద్య శిబిరాన్ని కిమ్స్ సవేరా ఆసుపత్రి సహకారంతో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు మర్రిరెడ్డి మనోహర్ రెడ్డి కార్యదర్శి పి.శ్రీధర్ బాబు బుధవారం తెలిపారు. బుధవారం స్థానిక ఎన్టీవో హోంలో వైద్యశిబిరానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15వ తేదీ ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కిమ్స్ సవేరా, ఏపీ ఎన్జీవో నగర శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత గుండె, కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిఆర్‌బిఎస్, బిపి, ఈసీజీ, 2డిఎకో పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలియజేశారు. నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యాక్రమంలో నగర శాఖ కోశాధికారి ఆర్.శ్రీనివాసులు పాల్గొన్నారు.