విలేకరుల సమావేశ:లో పాల్గొన్న నాయకులు
ధర్మవరం రూరల్ : విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ నిధులను కార్మికుల వేతనాలకు, పరిశ్రమ నడపడానికి మాత్రమే ఖర్చు పెట్టాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు మండల నాయకులు జెవి. రమణ, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, సిఐటియు టి అయుబ్ ఖాన్ ,ఎల్ ఆదినారాయణ, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు మారుతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం కేటాయించిన బడ్జెట్ కేవలం గతంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల కోసం మాత్రమే అని పేర్కొనడం అన్యాయమన్నారు. పరిశ్రమ నడవాలంటే పాత బకాయిలు చెల్లించడం ఒకటే కాదని, పరిశ్రమలో ఉత్పత్తుల కోసం కష్టపడుతున్న కార్మికుల వేతనాలను కూడా చెల్లించాలనిఅన్నారు. కేవలం పాత బకాయిల కోసమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడాన్ని బట్టి చూస్తే కార్మికులను, పరిశ్రమను నట్టేట ముంచే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు హైదర్ వలి, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.