విద్యుత్ సబ్‌స్టేషన్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి సవిత, ఎంపి పార్థసారధి, కలెక్టర్ చేతన్
ప్రజాశక్తి-గోరంట్ల
రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, ఎంపి బికె.పార్థసారధి, జిల్లా కలెక్టర్ టిఎస్. చేతన్ తెలిపారు. మండలంలోని బి.గొల్లపల్లి గ్రామంలో రూ. 78.98 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 220/132 కె.వి. విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గురువారం సిఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారం భించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత, ఎంపి పార్థసారధి, జిల్లా కలెక్టర్ చేతన్ హాజరై విద్యుత్ ఉప కేంద్రం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులను సిఎం చంద్రబాబు ప్రారంభించారన్నారు. అందులో భాగంగా గోరంట్లలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామ న్నారు. ఈ సబ్ స్టేషన్ వల్ల గోరంట్ల, చిలమత్తూరు, పుట్టపర్తి మండలాలకు విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు పగటి పూట 9 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందుతుందన్నారు. గృహ, ఇతర రంగాలకు మెరుగైన విద్యుత్ అందుతుందన్నారు. లో వోల్టేజీ సమస్యలు, విద్యుత్ సరఫరాలో నష్టాలు, అంతరాయాలు తగ్గుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యావరణ హితమైన సౌర, పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నా యన్నారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన సౌర, పవన విద్యుత్‌ను ఎపి గ్రిడ్‌కు అను సంధానం చేసేందు కు ఈ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించామన్నారు. ఈ ప్రాంతం పరిధిలోని గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాల మేరకు 33 కె.వి. ఫీచర్స్ మంజూరైందని, త్వరలో ఈ పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఎంపి మాట్లాడుతూ సోలార్ ప్రాజెక్టుపై ఈ ప్రాంత రైతుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. సోలార్ ప్రాజెక్టు వల్ల సోలార్ ఏజెన్సీ వారు ఒప్పందం ప్రకారం రైతుల నుంచి భూములను లీజుకు తీసు కొని ఏడాదికి ఎకరాకు రూ. 30 వేలు ఇస్తారన్నారు. కార్యక్రమంలో తహశీ ల్దార్ మారుతి, ఎంపిడిఒ నరేంద్ర కుమార్, విద్యుత్ శాఖ అధికారులు, టిడిపి మండల కన్వీనర్ సోమశేఖర్, నాయకులు బాలకృష్ణచౌదరి, ఉత్తమ్‌రెడ్డి, చంద్ర, నరేష్, దేవా, నర్సింహప్ప, అశ్వత్థరెడ్డి, చంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, వేణు రాయల్, అజ్మతుల్లా, తదితరులు పాల్గొన్నారు.