ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు

Oct 30,2024 22:49

 శిలాఫలకం ఆవిష్కరణలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి

                       ఓబుళదేవర చెరువు : ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 50 లక్షలతో నిర్మించిన బ్లాక్‌ పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్‌ భవనాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి, జిల్లా వైద్యాధికారిని మంజుల వాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ మార్పుల వల్ల వాడుతున్న ఆహారం నీటి పరిస్థితుల వల్ల అనేక జబ్బులు మనిషికి వస్తున్నాయని వాటి నిర్మూలనకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌ఛార్జి పత్తి చంద్రశేఖర్‌ , డిఐఒ నాగేంద్ర నాయక్‌, ఓడి చెరువు మండల వైద్యాధికారులు భాను ప్రకాష్‌, కమల్‌ రోహిత్‌, ఆర్‌ అండ్‌ బి అధికారులు సంజీవయ్య, కంబగిరి స్వామి, టీడీపీ మండల కన్వీనర్‌ జయచంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుల్‌ రెడ్డి, పీట్లా సుధాకర్‌, బోయపల్లి శివారెడ్డి, కాంట్రాక్టర్‌ లోకేశ్వర్‌ రెడ్డి, ల్యాబ్‌ టెక్నిషియన్‌ నరేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం :

మహిళల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందనిఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఏరియా కోఆర్డినేటర్‌ రవీంద్ర అధ్యక్షతన ఐకెపి మహిళలతో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళలు జీవన ప్రమాణాలు పెంపొందించుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు. మాజీ మంత్రి డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు.

➡️