డీలర్ల సమస్యలపై వినతి

Mar 25,2025 22:22

వినతిపత్రం అందజేస్తున్న డీలర్లు 

                        ధర్మవరం రూరల్‌ : మండలంలోని ఆయాగ్రామాలకు చెందిన డీలర్లు తమ సమస్యలపై స్థానిక తహశీల్దార్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ ప్రతి ఒక్క షాప్‌ లో 15 క్వింటాళ్ల బియ్యానికి నాలుగు క్వింటాళ్లు తక్కువ వస్తున్నాయన్నారు. దీంతో బియ్యం పంపిణీ చేయాలంటే ఇబ్బందులు పడుతున్నామన్నారు. అదేవిధంగా హమాలీలు సమస్య కూడా ఉందన్నారు. ప్రతి షాప్‌ కి వెయ్యి రూపాయలు ఇస్తేనే బియ్యం దింపుతామని చెబుతున్నారన్నారు. ఈ విషయంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డీలర్లు కోరారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం నాయకులు మహేష్‌ చౌదరి, లక్ష్మన్న, స్టోర్‌ డీలర్లు వి జయసారధి, రాంమోహన్‌ రెడ్డి, రవి, సుధాకర్‌ నాయుడు, రాఘవ రెడ్డి, వెంకటరాముడు, బాలప్ప, నాగనంద, రామాంజనేయులు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

➡️