అనుమతులిస్తే వ్యర్థాలు ప్రత్యేక వాహనంలో తరలిస్తాం

Jun 11,2024 22:06

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

              హిందూపురం : బక్రీదు పండుగను పురస్కరించుకుని పురపాలక సంఘ వ్యాప్తంగా వ్యర్థ పదార్థాలను సేకరించి ప్రత్యేక వాహనంలో పురపాలక సంఘ డంప్‌ యార్డుకు తరలిస్తామని రహమత్‌ ఏ ఆలం సామాజిక సంఘం అధ్యక్షులు అబ్దుల్‌ మాలీక్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్‌ కార్యలయంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మేన్‌ జబివుల్లాతో కలిసి కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డికి వినతిని ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు బక్రీదు పండుగను పురస్కరించుకుని మూడు రోజుల పాటు ఖుర్బానీ( బలి)ఇచ్చే కార్యక్రమంలో వ్యర్థ పదార్థాలను ప్రత్యేక వాహనంలో సేకరించి, దానిని పురపాలక సంఘం వారు ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డుకు తరలిస్తామన్నారు. దీంతో పట్టణం శుభ్రంగా ఉంటుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సామాజిక సేవా సంఘం తరపున టాటా ఏసీ వాహనాల్లో వ్యర్థ పదార్థాలను సేకరిస్తామన్నారు. డంప్‌ యార్డులో మున్సిపల్‌ శాఖ తరపున ఒక గుంతను ఏర్పాటు చేయడంతో పాటు సేకరించిన వ్యర్థాలను గుంతలో వేయడానికి ట్రాక్టర్‌ అందించాలని కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతు మంచి పనులు చేయాడానికి ముందుకు వస్తే తప్పకుండా అనుమతులు ఇవ్వడంతో శాఖ తరపున అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు పాల్గొన్నారు.

➡️