ఎస్పీ వి.రత్న
ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్
అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో ఎక్కడైనా బాణసంచా అక్రమంగా నిల్వ ఉంచినా, విక్ర యాలు జరిపినా చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వి.రత్న ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రమా దాలకు తావు లేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ బాణసంచా నిల్వ ఉంచాలన్నారు. లైసెన్స్ పొందిన వారు కేటాయించిన ప్రదేశంలోనే దుకాణం ఏర్పాటు చేసుకుని టపా సులు విక్రయించాలన్నారు. నీరు, ఇసుక, తదితర, అగ్నిమాపక సామగ్రిని తప్పనిసరిగా దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా మందు గుండు సామగ్రి కలిగి ఉన్నా, తయారుచేసినా లేదా అనధికార ప్రదేశాలల్లో నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవన్నారు. టపాసుల దుకాణాల వద్ద అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేసి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా దీపావళి పండుగను సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చే సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ప్రమాదం చోటు చేసుకున్నా, అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా వెంటనే డయల్ 100 లేదా డయల్ 112కి లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లా వ్యాప్తంగా టపాసుల విక్రయదారులు విధిగా నిబంధనలు పాటించాలని ఎస్పీ ఆదేశించారు.